Webdunia - Bharat's app for daily news and videos

Install App

''టార్చిలైట్''లో అశ్లీలత మోతాదు మించిందే.. సదాకు మళ్లీ కష్టాలు..

వేశ్యావృత్తిలో నలిగిపోతున్న అమ్మాయిల నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సదా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు ''టార్చిలైట్'' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫి

Webdunia
సోమవారం, 9 జులై 2018 (15:36 IST)
వేశ్యావృత్తిలో నలిగిపోతున్న అమ్మాయిల నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సదా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు ''టార్చిలైట్'' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు నిరాకరించింది. 
 
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కారణాలతో ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగిందనుకుంటే.. తాజాగా సెన్సార్ ఇబ్బంది కూడా ఎదురైంది. కొన్ని వారాల క్రితమే ఈ చిత్రాన్ని సెన్సార్‌కు పంపగా, అశ్లీలత మోతాదు మరీ ఎక్కువగా ఉందన్న కారణంతో సర్టిఫికేట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది.
 
దీంతో దర్శక నిర్మాతలు ఢిల్లీలో ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి, సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు సమాచారం. విజయ్‌తో ''తమిళన్'' సినిమాను తెరకెక్కించిన ఎ.మజీద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 
 
''జయం'' సినిమా ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీకి సదా పరిచయం అయ్యింది. ఆపై స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఆపై ఆమెకు గుర్తింపు సంపాదించిపెట్టే అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలకు కాస్త దూరమైన సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం 30 ఏళ్ల వయస్సులో డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ''టార్చ్‌లైట్'' ద్వారా సదా ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్నారు.. ప్రేక్షకులంతా. కానీ ఆ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో సదాకు మళ్లీ కష్టాలు తప్పవని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments