Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు, స‌మంత ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..?

రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా ఆశించిన స్ధాయిలో స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడిగా మారి చిలసౌ సినిమా చేసాడు. ఇందులో సుశాంత్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర నిర్మాత ఆఖ‌రి నిమిషంలో చేతులు ఎత్తేయ‌డంతో ఆఖ‌రికి అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఆదుకోవాల్సి వ‌చ్చింది. అయిత

Webdunia
శనివారం, 14 జులై 2018 (19:29 IST)
రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా ఆశించిన స్ధాయిలో స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడిగా మారి చిలసౌ సినిమా చేసాడు. ఇందులో సుశాంత్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర నిర్మాత ఆఖ‌రి నిమిషంలో చేతులు ఎత్తేయ‌డంతో ఆఖ‌రికి అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఆదుకోవాల్సి వ‌చ్చింది. అయితే.. అస‌లు ఈ క‌థను ముందుగా రాహుల్ ర‌వీంద్ర‌న్ చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రికీ చెప్పాడ‌ట‌. కథ విన్న చైత‌న్య‌, స‌మంత సుశాంత్‌తో ఈ సినిమా చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌.
 
వీరిద్ద‌రి స‌ల‌హా మేర‌కు రాహుల్ సుశాంత్‌తో ఈ సినిమా చేసారు. ఈ సినిమాని త‌క్కువ టైమ్‌లో కంప్లీట్ చేయ‌డం.. ఇది బాగా రావ‌డంతో అన్న‌పూర్ణ సంస్థ రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో సినిమా చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇందులో నాగ‌చైత‌న్య న‌టించ‌నున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... రాహుల్ తొలి ప్ర‌య‌త్నం స‌క్స‌స్ చేసేందుకు చైత‌న్య‌, స‌మంత రంగంలోకి దిగి బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ నెల 27న చిల‌సౌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. చైత‌న్య‌, స‌మంత ప్ర‌య‌త్నం ఫ‌లించి సుశాంత్, రాహుల్‌కి విజ‌యం వ‌స్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments