విజ‌య్‌తో ఎంజాయ్ చేశానంటున్న ఛార్మి

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (15:47 IST)
Charmi with Vijay
ఛార్మి ఎక్క‌డున్నా స‌ర‌దా, స‌ర‌దాగా సాగుతుంది అక్క‌డి వాతావ‌ర‌ణం. త‌న కార్యాల‌యంలో వుంటే అక్క‌డి స్టాఫ్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇక షూటింగ్ స్పాట్‌లో చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా క‌నుక త‌న కిష్ట‌మైన విధంగా గ‌డిపేస్తుంది. అలాంటి సంఘ‌ట‌న ముంబైలో జ‌రిగింది. విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్. `సాలా క్రాస్ బీడ్` అంటూ పూరి జగన్నాద్ దర్శకత్వంలో వ‌స్తుంది. ఇందులో చార్మి కూడా ఒక నిర్మాత‌.  కరణ్ జోహార్ కూడా స‌మ‌ర్ప‌కుడు. ఈ సినిమా ఇప్ప‌టికే ఆస‌క్తి రేపుతుంది. షూటింగ్ ముంబై లో జరుగుతుంది. విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్ లో చార్మీ ఓ యాక్టివాపై హీరో విజయ్ దేవరకొండను ఎక్కించుకుని కాసేపు షికారు చేశారు. 
 
దీనికి సంబంధించిన ఫొటోలను చార్మీ ట్విట్టర్ లో పంచుకుంది. విజ‌య్ కూడా త‌న ఖాతాలో పోస్ట్ చేసి చార్మి ఆనందాన్ని వ‌ర్ణించ‌లేనంటు తెలియ‌జేస్తున్నాడు. ఇక చార్మి అయితే, “మీరు చూస్తున్నారు, విజయ్ నాపై గట్టి నమ్మకంతోనే బండెక్కాడు! షూటింగ్ విరామంలో ముంబయి రోడ్లపై ఇలా సరదాగా విహరించాం” అని వెల్లడించింది. ఈ సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments