Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేగువేరా బయోపిక్ చే మూవీ ట్రైలర్ విడుద‌ల‌

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (16:35 IST)
Che movie
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న మూవీ “చే”. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. “చే” చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. “చే” ట్రైల‌ర్‌ను చూస్తే రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఉందంటూ సోషల్ మీడియాలో రివ్యూలు వెలువ‌డ‌తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది.. ఇటీవలే చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి చిత్రయూనిట్‌ను అభినందించారు.
 
“చే” మూవీ ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. “చేగువేరా బ‌యోపిక్ తీయాల‌న్న‌ది త‌న ఇర‌వై ఏళ్ల క‌ల అని అన్నారు. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జ‌రిగిన‌ ఎన్నో అరుదైన విష‌యాలు త‌మ సినిమాలో చూపించిన‌ట్టు తెలిపారు. అనాటి పరిస్థితులను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తెర‌కెక్కించామ‌ని, క్వాలిటీ విష‌యంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేద‌ని చెప్పారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ట్రైల‌ర్ బాగుందంటూ ప‌లువురు సినీ ప్ర‌ముఖుల నుంచి కాల్స్ వ‌స్తున్నాయ‌న్నారు. ఈ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు బి.ఆర్ సభావత్ నాయక్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments