Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్న చిరంజీవి, ఎందుకో తెలుసా?

అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఈ సినిమా నిన్న విడుదలై హిట్ టాక్‌తో ముందుకు వెళుతోంది. అల్లు శిరీష్ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి అల్లు

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:26 IST)
అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఈ సినిమా నిన్న విడుదలై హిట్ టాక్‌తో ముందుకు వెళుతోంది. అల్లు శిరీష్ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్నారట. చిరంజీవి ఇంటికి ఎందుకు రమ్మంటున్నారో.. అది కూడా నన్ను మాత్రమే రమ్మంటున్నారు.. ఎందుకో అర్థం కాక అల్లు శిరీష్ భయంభయంగా ఉదయం ఇంటికి వెళ్ళాడట. 
 
అయితే చిరంజీవి అల్లు శిరీష్‌‌ను గట్టిగా హత్తుకుని బాగా చేశావ్ శిరీష్‌. నీ నటన చాలా బాగుంది. ఒక్క క్షణం సినిమా కథ కూడా చాలా బాగుంది. భావోద్వేగంతో నటించిన నీ నటన బాగా నచ్చిందంటూ ప్రశంసలతో శిరీష్‌‌ను ముంచెత్తారట చిరు. దీంతో శిరీష్‌ ఆనందానికి అవధుల్లేవట. నేరుగా ఇంటికి వెళ్ళిన అల్లు శిరీష్‌ తన తండ్రి అల్లు అరవింద్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడట. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి నన్ను మెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడట.
 
గతంలో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే అల్లు శిరీష్‌ సక్సెస్ సాధించగా అంతకు ముందు నటించిన గౌరవం సినిమా ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ హిట్ కోసం వెతుకుతూ చివరకు ఒక్క క్షణం సినిమాతో అల్లు శిరీష్‌ మరో విజయాన్ని సాధించుకున్నారు. చిరంజీవితో పాటు అన్న అల్లు అర్జున్ కూడా అల్లు శిరీష్‌ ను పొగడ్తలతో ముంచెత్తారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments