Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో మెగాస్టార్ చిరంజీవి "గాడ్‌ఫాదర్"

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (10:54 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "గాడ్‌ఫాదర్". ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, పెద్దగా ప్రదర్శనకు నోచుకోలేక పోయింది. 
 
మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయింది లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగు నెటివిటీలకు తగినట్టుగా కొన్ని మార్పులు చేసి ఇక్కడ రిలీజ్ చేశారు. మొదటివారం కలెక్షన్లు ఫర్వాలేదనిపించాయి. ఆ తర్వాత పూర్తిగా పడిపోయాయి. 
 
ఈ పరిస్థితుల్లో శుక్రవారం రాత్రి నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరంభంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ చిత్రం కనీసం ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది. 
 
కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతిథి పాత్రలో నటించగా, ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. హీరో రామ్ చరణ్, ఆర్బీ చౌదరిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం.. చనిపోయే హక్కు అమలు.. ఎక్కడ?

Amphex 2025: ఆంఫెక్స్ 2025.. కర్ణాటకలో ప్రత్యేక దళాలు కనువిందు (ఫోటోలు)

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments