Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వో ఫైటర్‌వి.. అనేక సంక్షోభాలు అధిగమించావ్... సంజూకు చిరు ఓదార్పు

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (22:58 IST)
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల కేన్సర్ నాలుగో దశలో ఉన్నట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. పైగా, సంజయ్ దత్‌కు అనేక మంది ధైర్య వచనాలు చెపుతూ తమ ట్విట్టర్ ఖాతాల్లో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సంజయ్‌కు ఓదార్పు వచనాలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా సంజయ్ దత్ ఆరోగ్య పరిస్థితి వార్త విని చిరంజీవి చలించిపోయారు. 
 
'అత్యంత ప్రియమైన సంజయ్ భాయ్... నువ్వింతటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నావని తెలిసి ఎంతో బాధగా ఉంది. కానీ నువ్వో ఫైటర్‌వి. ఎన్నో ఏళ్లుగా అనేక సంక్షోభాలను అధిగమించావు. ఎలాంటి సందేహం లేదు, దీన్నుంచి కూడా నువ్వు తప్పకుండా బయటికి వస్తావు. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రేమతో ప్రార్థిస్తున్నాం" అంటూ ట్వీట్ చేశారు. 
 
గతంలో సంజయ్ దత్ హిందీలో "మున్నాభాయ్ ఎంబీబీఎస్" సినిమా చేయగా, చిరంజీవి ఆ సినిమాను తెలుగులోకి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' పేరుతో రీమేక్ చేసి భారీ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా సీక్వెల్‌ను కూడా చిరు తెలుగులో చేశారు. మొత్తంమీద సంజయ్ దత్‌కు వచ్చినన్న కష్టాలు మరెవ్వరికీ రాకూడదని ఆయన అభిమానులు, ఆప్తమిత్రులు కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

Chandrababu: రైతన్నల కష్టమే అమరావతి- ఏపీ చరిత్రలో ఒక స్వర్ణ దినం -చంద్రబాబు (video)

అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోడి (video)

2011లో జరిగిన పెళ్లి.. వరుడికి గిఫ్టుగా హెలికాప్టర్.. 30వేల మంది అతిథులు

పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments