Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" న్యూ పోస్టర్‌కు సైబరాబాద్ పోలీస్ క్రియేటివిటీ - వావ్ అంటున్న నెటిజన్స్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:09 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రం నుంచి మంగళవారం న్యూలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బుల్లెట్‌పై హీరోలిద్దరూ చక్కర్లు కొడుతున్నార. బైక్‌ను ఎన్టీఆర్ డ్రైవ్ చేస్తుంటే, రామ్ చరణ్ వెనుక కూర్చొనివున్నారు. 
 
ఈ కొత్త పోస్టర్‌కు సైబరాబాద్ పోలీసులు క్రియేటివిటీ చేశారు. దీన్ని చూసిన నెటిజెన్స్ వావ్ అంటూ కితాబిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు హెల్మెట్ పెట్టిన పోస్టర్‌ను సైబరాబాద్ పోలీసులు రిలీజ్ చేశారు. 
 
కొత్త ఫోటోలో ఎన్టీఆర్ బండి నడుపుతూ ఉంటే.. రామ్ చరణ్ వెనకాల ఉన్న ఫోటో చూసి అభిమానులు ఒకటే పండగ చేసుకుంటున్నారు. అయితే.. కొంత మంది నెటిజన్స్ ఈ ఫోటోలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు హెల్మెట్ పెట్టి సైబరాబాద్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. 
 
బైకుపై వెళ్లే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. చాలా మంది యాక్సిడెంట్ సమయంలో వెనకాల ఉన్నవాళ్లు గాయపడి కన్నుమూస్తున్నారు. ఈ సందర్భంగా "ఆర్ఆర్ఆర్" పోస్టర్‌తో హెల్మెట్ పెట్టుకోండి. ప్రాణాలను కాపాడుకోండి అంటూ సైబరాబాద్ పోలీసులు పిలుపు ఇచ్చారు. 
 
దీనిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ కూడా స్పందించింది. మీరు పెట్టిన క్యాప్షన్ పర్ఫెక్ట్‌గా లేదు. బండికి నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ రిప్లై ఇచ్చారు. ఇపుడీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా అంతా పూర్తైయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments