నందమూరి బాలక్రిష్ణ నటించిన డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుందంటూ చిత్ర యూనిట్ తాజా పోస్టర్ విడుదల చేసింది. ఇటీవలే కార్తీక పూర్ణిమ సందర్భంగా టీజర్ ను కూడా విడుదల చేశారు. మిలియన్ వ్యూస్ పైగా సాధించుకుంది. దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్. తమన్ చిత్ర సాంకేతికతగా పనిచేస్తున్నారు. జనవరి 12న సంక్రాంతికి సినిమా విడుదలకాబోతుంది.
కథాపరంగా ఉత్తరాదిలోని డాకూ సాబ్ కు చెందిన రియల్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. రాజుకానీ మహారాజు కథగా దర్శకుడు బాబీ చెబుతున్నాడు. అలాంటికథలు బాలీవుడ్ లో చాలానే వచ్చాయి. అయితే అందులో కీలకమైన పాయింట్ ఏమిటి? ఎందుకు మరలా సినిమా తెరకెక్కిస్తున్నారు. అనేది అభిమానుల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలక్రిష్ణ రాజకీయ నాయకుడిగా ప్రజా సేవ చేస్తున్న తరుణంలో పేదల పక్షాన నిలిచే ఓ సామాన్యుడు మహారాజుగా మారిన వైనం బాగా నచ్చి చిత్రాన్ని నిర్మించామని నిర్మాత వంశీ తెలియజేస్తున్నారు.
ప్రగ్వాజైశ్వాల్, శ్రద్దా శ్రీనాథ్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సాయిసౌజన్య, వంశీ నిర్మిస్తున్నారు.