Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50లక్షలివ్వండి.. లేకుంటే అలియా భట్‌ను చంపేస్తాం: ఆగంతకుడి ఫోన్

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మొత్తం మహేష్ భట్ కుటుంబాన్ని చంపేయడానికి ప‌క్కాప్లాన్ వేశారు. అయితే వారి కుట్ర‌ను భ‌గ్నం చేసి 2014 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రూ.50లక

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (12:31 IST)
దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మొత్తం మహేష్ భట్ కుటుంబాన్ని చంపేయడానికి ప‌క్కాప్లాన్ వేశారు. అయితే వారి కుట్ర‌ను భ‌గ్నం చేసి 2014 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రూ.50లక్షలు ఇవ్వాల్సిందిగా.. ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడని.. అడిగిన మొత్తం ఇవ్వకుంటే బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో పాటు ఆయన భార్యను కూడా చంపేస్తానని బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత మ‌హేష్ భ‌ట్‌ను బెదిరించాడు. మొదట్లో ఫోన్ వస్తే పెద్దగా పట్టించుకోని మహేష్ భట్.. ఆపై వరుసగా ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు ఫోన్లు వ‌స్తుండ‌టంతో భ‌ట్ పోలీసుల‌ను ఆశ్రయించాడు. 
 
ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి, భట్ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఈ కేసును ముంబై పోలీసు శాఖలోని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ (ఏఎన్‌సీ)కి బదిలీ చేశారు. తాను ఒక గ్యాంగ్ లీడర్‌ని అని చెప్పుకొని అతడు బెదిరించినట్లు చెప్తున్నారు. డ‌బ్బును మొత్తం ల‌క్నోలోని ఓ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల్సిందిగా ఆగంత‌కుడు ఫోన్ చేసిన‌ట్లు భ‌ట్ పోలీసులకు చెప్పారు. దీంతో మ‌హేష్ భ‌ట్ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతోపాటు ఆయ‌న నివాస ప్రాంతం చుట్టుప‌క్క‌ల భద్రతను కట్టుదిట్టం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments