Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (12:33 IST)
టాలీవుడ్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ల వివాహ బంధం ముగిసిపోయింది. వీరిద్దరికీ చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 20 యేళ్ల పాటు సాగిన వైవాహిక బంధం తెగిపోయింది. గత 2004లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వేధ్, లింగా అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత 2022లో ఈ జంట విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ధనుష్ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. కలిసి వుండేందుకు ప్రయత్నించాలని సూచించింది. అయితే, తాము కలిసి జీవించలేమని, అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలంటూ వారిద్దరూ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శుభాదేవి వారికి విడాకులు మంజూరు చేస్తూ బుధవారం తుదితీర్పును వెలువరించింది. 
 
అయితే, వారిద్దరినీ కలిపేందుకు, సర్ది చెప్పేందుకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలిచంలేదు కదా, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ధనుష్, ఐశ్వర్యల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments