Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanush: ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంతా కోపమా

దేవి
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:15 IST)
Dhanush
పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ అంటూ దర్శకుడిగా మరోసారి అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది.
 
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను పెంచేశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలో.. ధనుష్ కనిపించి ఇదొక సాధారణ ప్రేమ కథ అని అసలు కథలోకి తీసుకెళ్తాడు. ఓ ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. మాజీ ప్రేయసి పెళ్లి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ఎదురయ్యే సంఘటనలు, ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
 
ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గ స్టోరీతో ధనుష్ రాబోతోన్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.  పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ఇలా అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ స్పెషల్ అప్పియరెన్స్, ఆ పాటకు సంబంధించిన బిట్ కూడా ట్రైలర్‌లో పొందు పర్చారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా జి.కె. ప్రసన్న పని చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments