Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును ''మేడమ్'' చెప్పారు.. లైంగికంగా వేధించి, ఫోటోలు వీడియోలు తీశాను: పల్సర్ సునీ

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో దిలీప్ భార్య, సినీ నటి కావ్యామాధవన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. భావన కేసులో ఇప్పటికే దిలీప్ అరెస్టయ్యారు. ఇంకా బెయిల్ లభించకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (16:31 IST)
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో దిలీప్ భార్య, సినీ నటి కావ్యామాధవన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. భావన కేసులో ఇప్పటికే దిలీప్ అరెస్టయ్యారు. ఇంకా బెయిల్ లభించకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ  నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ.. మేడం ఆదేశాల మేరకే భావనను కారులో లైంగికంగా వేధించి, బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశానని సునీ విచారణలో వెల్లడించాడు. 
 
భావనను కిడ్నాప్ చేయాలని.. లైంగికంగా వేధించి ఫోటోలు తీయాలని ఆదేశించిన  మేడం కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని పల్సర్ సునీ స్పష్టం చేశాడు. ఆ మేడమ్ కావ్యా మాధవన్ అని మూలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. పోలీసులు కూడా దిలీప్ రెండో భార్య కావ్యా మాధవన్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ మేడం పేరేంటో చెప్పేందుకు మాత్రం పల్సర్ సునీ నిరాకరించినట్లు సమాచారం. 
 
దిలీప్, కావ్యామాధవన్ వివాహ వ్యవహారాన్ని తొలి భార్యకు భావన చెప్పడంతోనే అసలు సమస్య ఉత్పన్నమైందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్సర్ సునీ మేడమ్ అని కావ్యా మాధవన్‌నే అన్నారని... కానీ ఆమె సునీ తనకెవరో తెలియదని చెప్తుండటంపై పోలీసులు మండిపడుతున్నారు. మేడమ్‌కు తానెవరో బాగా తెలుసునని పల్సర్ సునీ చెప్పడంతో.. పోలీసుల అనుమానాలు బలపడతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం