Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ని వదిలేసి పూజా వచ్చేసిందా..?

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (22:02 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాథేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతోన్న భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. ఈ భారీ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా యు.వి.క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
 
అయితే.. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్, పూజతోపాటు టీమ్ అంతా షూటింగ్‌లో పాల్గొన్నారు. సుమారు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్‌లో పాల్గొన్న పూజా తాజాగా భారత్‌కు తిరిగి వచ్చింది.
 
 ఈ విషయాన్ని పూజా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది. రాధే శ్యామ్ ఇటాలియన్ షెడ్యూల్‌ను పూర్తి చేశాను. ఈ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌కు ధన్యవాదాలు.
 
హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్ అని పూజా పేర్కొంది. ఇటీవల రిలీజ్ చేసిన రాథేశ్యామ్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగిందని చెప్పచ్చు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా కృష్ణంరాజుపై సన్నివేశాలను చిత్రీకరించలేదు.
 
త్వరలోనే కృష్ణంరాజుపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధిస్తుందో అని అభిమానులు వెయిటింగ్. మరి... ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం.. నరేంద్ర మోదీ పర్మిషన్ ఇస్తారా?

కుక్కల సతీశ్ ఇంట్లో ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం ఉత్తుత్తిదేనట

పవన్ కల్యాణ్ చిన్న కుమారిడిపై పరోక్షంగా కామెంట్లు చేసిన రోజా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments