Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లీ లేదు.. పెటాకులు లేవు .. అవన్నీ పుకార్లే : రెజీనా

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (16:46 IST)
గతవారం నిశ్చితార్థం జరిగినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హీరోయిన్ రెజీనా కెసాండ్రా స్పష్టం చేశారు. ఈ హీరోయిన్‌కు తెలుగులో మంచి గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే. అయితే, సరైన సమయంలో సరైన హిట్స్ లేకపోవడంతో ఇతర హీరోయిన్ల కంటే బాగా వెనుకబడిపోయింది. 
 
ఈ క్రమంలో ఆమె సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితంలోకి ప్రవేశించనుందే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులోభాగంగా, గత వారం ఆమె నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. 
 
వీటిపై రెజీనా స్పందిస్తూ, గత వారం రోజులుగా సోషల్ మీడియాలో నా పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి మరింతగా వ్యాపిస్తున్నాయి. పైగా, ఈ వార్తలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే నా పెళ్ళి వార్తలపై ఓ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతోంది. గత వారం తనకు ఎలాంటి నిచ్చితార్థం జరగలేదని స్పష్టంచేసింది. 
 
నిశ్చితార్థం జరగనపుడు ఇక పెళ్లి తేదీ ఎలా ఖరారు అవుతుందని ఆమె ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారో... ఎవరు పుట్టిస్తున్నారో అర్థంకావడం లేదు. నిజంగానే నాకు పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని నేని స్వయంగా వెల్లడిస్తానని, అప్పటివరకు ఇలాంటి పుకార్లు నమ్మొద్దు అని రెజీనా కెసాండ్రా స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments