Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు నోటిదూల ఎక్కువా? దిల్ రాజు ఏమన్నారు?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (15:35 IST)
అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంతకు ఇటీవలి కాలంలో నోరు కాస్త ఎక్కువైందనే ప్రచారం సాగుతోంది. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన చిత్రం "96". ఓ మంచి క్లాసికల్ హిట్ చిత్రం. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంపై సమంత స్పందిస్తూ, '96' మూవీ ఓ క్లాసిక్ మూవీ. దాన్ని ఎవరూ రీమేక్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది అంటూ వ్యాఖ్యానించారు. కానీ, ఈ చిత్రం రీమేక్‌లో సమంతనే అనుకోకుండా ఎంపికైంది. ఇందులో హీరోగా శర్వానంద్ నటించనున్నాడు. 
 
ఈ నేప‌థ్యంలో గతంలో సమంత చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ, 'ఈ సినిమాను నేను విడుద‌ల‌కు ముందే చూశా. తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌నిపించింది. వేంట‌నే రీమేక్ హ‌క్కులు తీసుకున్నా. త‌గిన న‌టీనటులు దొరికితే తెలుగులో కూడా నేనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాన‌ని త‌మిళ డైరెక్ట‌ర్ కూడా చెప్పారు. వెంట‌నే నేను స‌మంతను సంప్ర‌దించా. అప్ప‌టికే '96' గురించి మీడియాలో వార్త‌లు వ‌చ్చేశాయి. ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. దాంతో స‌మంత అలా స్పందించి ఉంటుంది. ఈ టీమ్‌లో ఎవ‌రెవ‌రున్నారో తెలియ‌క అలా మాట్లాడేసింది. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను చేస్తున్న తొలి రీమేక్ ఇది. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులోనూ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం నాకుంది' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments