Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనా కసాండ్రా ఫస్ట్ కిస్ కు దిలీప్ ప్రకాష్ ఏమిచేసాడంటే..

డీవీ
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (18:26 IST)
Dilip Prakash - Regina Cassandra
ఉత్సవం' మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలలో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఉత్సవం ఫస్ట్ సింగిల్ ఫస్ట్ కిస్. టైటిల్ సూచించినట్లుగా, ఈ పాట హీరో ఫస్ట్ కిస్ అనుభవానికి సంబంధించినది.

కథానాయిక పాత్ర పోషించిన రెజీనా కసాండ్రా అనుకోకుండా హీరో పెదవులపై ముద్దు పెట్టుకుంది, అతను తన అదృష్టాన్ని నమ్మలేకపోతాడు, పాట, డ్యాన్స్ తో హీరో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు.
 
అనూప్ రూబెన్స్ మాస్ బీట్‌లతో గ్రూవీ యూత్‌ఫుల్ నంబర్‌ను అందించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం యూత్ ఫుల్ గా ఉంది. రామ్ మిరియాల రామ్ తన డైనమిక్ వోకల్స్ తో పాటకు అదనపు ఉత్సాహాన్ని తెచ్చారు. దిలీప్ ప్రకాష్ తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టాడు. ఫస్ట్ కిస్ మ్యూజిక్ ప్రమోషన్‌లకు పర్ఫెక్ట్ స్టార్ట్, అద్భుతమైన కంపోజిషన్, అద్భుతమైన గానంతో ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లను రాక్ చేయబోతోంది.
 
'ఉత్సవం'  భావోద్వేగాలు, ప్రేమ , నోదంతో కూడిన హోల్సమ్  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రల్లో నటిస్తున్న  ఈ చిత్రానికి నిష్ణాతులైన సాంకేతిక బృందం పని చేస్తోంది ప్రముఖ డీవోపీ రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.
 
తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments