Webdunia - Bharat's app for daily news and videos

Install App

సో... పూరీ మత్తుమందు పీడితుడేనన్నమాట... 19న సిట్ ముందుకు...

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది తొలుత తమకు నోటీసులు అందలేదని బుకాయించారు. కానీ ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. తాజాగా రవితేజ తల్లి తన కుమారుడికి నోటీసులు వచ్చాయని చెప్పడంతో వరుసగా మిగిలినవారు కూడా తమకు నోటీసులు అందాయని వివరించారు.

Webdunia
సోమవారం, 17 జులై 2017 (21:57 IST)
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది తొలుత తమకు నోటీసులు అందలేదని బుకాయించారు. కానీ ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. తాజాగా రవితేజ తల్లి తన కుమారుడికి నోటీసులు వచ్చాయని చెప్పడంతో వరుసగా మిగిలినవారు కూడా తమకు నోటీసులు అందాయని వివరించారు. పూరీ జగన్నాథ్ కూడా తను ఈ నెల 19న సిట్ ముందు హాజరవుతున్నట్లు వెల్లడించారు.
 
మరోవైపు డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరు వుండటం వాస్తవమేనని తేలింది. ఆయనకు ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. ఈ నెల 22న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హాజరు కావాలని తెలియజేసింది. దీనితో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమారుడు కనీసం సిగరెట్ కూడా తాగడనీ, తాగేవాళ్లను కూడా ప్రోత్సహించడని అన్నారు. 
 
డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమన్న ఆమె తన కుమారుడికి డ్రగ్స్ అలవాటు ఉందన్న మాట అవాస్తవమన్నారు. రవితేజను కావాలనే ఎవరో ఇరికిస్తున్నారని అన్నారు. సోదరుడు పోయాడన్న బాధలోనే రవితేజ సినిమాలు చేస్తున్నాడనీ, నిర్మాతలకు నష్టం రాకూడదన్న ఒకే ఒక నిశ్చయంతో సినిమా షూటింగులకు వెళ్లాడని చెప్పుకొచ్చారు. 
 
తన కుమారుడు భరత్ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యాడనీ, ఇందులో భాగంగా అతడు అన్నీ మానేసి రోజూ వ్యాయామం చేసేవాడనీ, కానీ విధి వక్రించి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments