Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోయిన్ కావాలంటున్న రాజమౌళి...

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (13:12 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "ట్రిపుల్ ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల ఎంపిక ఇప్పటివరకు జరగలేదు. అయితే, ఈ చిత్రంలో లేడీ ప్రతినాయక పాత్రకు పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్ ప్రియమణిని ఆయన ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి దృష్టి కుర్రకారు హీరోయిన్‌పై పడినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఈషా రెబ్బా పేరును ఆయన పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్‌తో పాటు.. అనూ ఇమ్మాన్యుయేల్, రష్మిక మందన్నా తదితరుల పేర్లను ఆయన పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇపుడు ఈషా రెబ్బా పేరు తెరపైకి రావడం గమనార్హం.
 
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పైగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. అందుకే మంచి హీరోయిన్లను ఎంపిక చేసి వారితో అదిరిపోయే స్టెప్పులేసి థియేటర్‌లో హోరెత్తించాలన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో నటీనటుల పేర్లను కూడా వెల్లడించాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments