Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవ‌డ్రా న‌న్ను తొక్కేది.. మ‌రోసారి నోరు జారిన‌ విశ్వక్ సేన్..!

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (16:45 IST)
వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఫలక్‌నుమా దాస్'. మాస్ కా దాస్ టాగ్ లైన్‌‌తో విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవ‌ల‌ విడుదలై విశేష స్పందనను పొందుతూ మంచి కలెక్షన్స్‌లను రాబడుతోంది. 
 
ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రంలో
హీరో మరియు ఈ చిత్ర దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఎన్నో జరిగాయి కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సినిమా అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇకపై కూడా ర‌న్ అవుతూనే ఉంటుంది. 
 
నా టీమ్ కోఆపరేషన్, కష్టం లేకపోతే సినిమా సక్సెస్ టాక్ వచ్చేది కాదు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఫలక్‌నుమా దాస్’తో ధమ్కీ ఇచ్చా.. నా నెక్స్ట్ సినిమాతో షాక్ ఇస్తా. సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చూస్తుంటే మ‌జా వ‌స్తుంది. ఫ్యాన్స్ ఏమో మెసేజ్ చేస్తున్నారు.

జాగ్ర‌త్త రా తొక్కేస్తరు తొక్కేస్తారు అని అంటున్నారు. తొక్క‌డానికి నేనేమ‌న్నా కోకోకోలా టిన్నా.. ఎవ‌డ్రా న‌న్ను తొక్కేది అన్నారు. ఈ విధంగా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇలా మాట్లాడ‌డం సినిమా ప్ర‌మోష‌న్‌కి బాగానే ఉప‌యోగ‌ప‌డింది కానీ... ఇలాగే కంటిన్యూ చేస్తే... కెరీర్‌కి దెబ్బే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments