Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌కీల్ సాబ్ షో.. చేతిని కోసుకుని తెరపై రక్తంతో పీఎస్‌పీకే అని రాశాడు..

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (15:01 IST)
ఏప్రిల్ 9న విడుద‌లైన వ‌కీల్ సాబ్ చిత్రం భారీ క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. చిత్రంలో అన‌న్య‌, అంజ‌లి, నివేదా థామ‌స్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో వున్నారు. ప‌వ‌న్ అంటే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగే అభిమానులు కొంద‌రు అన‌వ‌స‌రంగా త‌మ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన ప‌ని నెటిజ‌న్స్‌కు తెగ కోపం తెప్పిస్తుంది. 
 
సినిమా ప్ర‌సారం అవుతున్న స‌మ‌యంలో ఆనందం త‌ట్టుకోలేక ఓ అభిమాని త‌న చేతిని కోసుకొని తెర‌పై ర‌క్తంతో పీఎస్‌పీకే అని రాసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తెర ముందు అభిమాని ఇలాంటి దుశ్చ‌ర్య చేయ‌డం జ‌నాల‌ను విస్తుపోయేలా చేసింది. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది, ఆ వ్య‌క్తి ఎవ‌రనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. అయితే ఇలా తన కోసం చేతులు కోసుకునే లేదా కాల్చుకునే అభిమానాన్ని పవన్ కాదు ఏ హీరో కూడా హర్షించరు.  
 
మరోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తూనే ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, సాయి ధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, నాగబాబు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించగా, తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌కీల్ సాబ్ మూవీపై త‌న ఒపీనియ‌న్ తెలియ‌జేశారు.
 
ప్ర‌తి చోట నేను వింటున్న ఒకే ఒక్క ప‌దం ప‌వ‌ర్ ప్యాక్డ్ బ్లాక్ బ‌స్ట‌ర్. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌రో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. వ‌కీల్ సాబ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ల‌కు నా అభినంద‌నలు అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments