Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్ ష్రాఫ్, కృతి సనన్ ఫైట్స్ తో కొత్త లోకాన్ని పరిచయం చేసిన గణపధ్ ట్రైలర్

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (17:01 IST)
Kriti Sanon fight
కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మెరైజ్ చేస్తోంది. గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ చిత్ర వర్గాల తోంపారు, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసింది. టైగర్ ష్రాఫ్ తో పాటూ కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ల కలయిక లో వచ్చిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో విపరీత అంచనాలు ఉన్నాయి. ఈ ఆసక్తిని మరింత పెంచేందుకు చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.
 
Tiger Shroff, Kriti Sanon
గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక యాక్షన్ విందు ను అందివ్వనుంది. స్టన్నింగ్ విజువల్స్, ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాల తో పాటు, భారీ కాస్టింగ్ ఉండటం తో సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఒక పెయింటింగ్ లాంటి నూతన ప్రపంచం లోకి తీసుకెళ్లింది. భవిష్యత్తు ను వరల్డ్ క్లాస్ వి ఎఫ్ ఎక్స్ ద్వారా సృష్టించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన లోకంలో తీసుకెళ్లడానికి ఖర్చు కి నిర్మాతలు వెనుకాడలేదు. నిర్మాత జాకీ భగ్నని సినిమాలో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు.
 
ఈ సందర్భంగా నిర్మాత జాకీ భజ్ఞని మాట్లాడుతూ, " గణపధ్ ట్రైలర్ కు, ఫస్ట్ సాంగ్ కు వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టం అంతా మర్చిపోయి, ప్రేక్షకుల అంచనాలు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 20న విడుదల కానున్న సినిమా ను కూడా ఇలాగే ఆదరిస్తారని, నమ్మకంగా ఉంది." అన్నారు.
 
గణపధ్ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు టైగర్ ష్రాఫ్ మ్యాచో ఫైట్స్, కృతి సనన్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, లెజెండ్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో ఉండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 
 
గణపధ్ : ఏ హీరో ఇస్ బార్న్ ప్రసిద్ధ పూజ ఎంటర్టైన్మెంట్, గుడ్ కో తో కలిసి వికాస్ బహ్ల్ దర్శకత్వంలో దేనికి రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని వశు భగ్నాని, జాకీ భాగ్నని, దీప్శిక దేష్ముఖ్, మరియు వికాస్ బహ్ల్ కలిసి నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల కి సిద్ధం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments