Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాజా రవితేజ ధమాకా గ్లింప్స్ వ‌చ్చేస్తోంది

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (16:28 IST)
Ravi Teja, Srileela
మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ "ధమాకా''. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట 'జింతాక్'కు అద్భుతమైన  స్పందన వచ్చింది.
 
తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్‌ ఫుల్‌ గా, రొమాంటిక్‌ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త  టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది,
 
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
 
‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
 
తారాగణం: రవితేజ, శ్రీలీల
సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన,  నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్,  బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల,  కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ,  సంగీతం: భీమ్స్ సిసిరోలియో,  సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని,  ఫైట్స్: రామ్-లక్ష్మణ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments