Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా సంతోషం అవార్ట్స్ ఫెయిల్- తెలుగు ఇండస్ట్రీకి బేడ్ నేమ్ వచ్చింది : అల్లు అరవింద్

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (13:39 IST)
allu arvind
మెగా కుటుంబానికి బాగా కావాల్సిన వాడు పి.ఆర్.ఓ. సురేష్ కొండేటి. గత కొన్ని సంవత్సరాలుగా సంతోషం అవార్డ్స్ నిర్వహిస్తున్నారు. ప్రతిసారీ ఏదో కాంట్రవర్సీ అవుతూనే వుంది. కొందరైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని అవార్డులు ఇతను ఇస్తున్నట్లు కితాబిచ్చారు. చాలా అవార్డులు అలానే జరిగాయి. అయితే ఈసారి ట్విస్ట్ ఏమంటే గ్రాండ్ గా గోవాలో డిసెంబర్ 2 న సౌత్ అవార్డులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. 
 
కానీ, నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంధికి సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో అబాసుపాలయింది.  ఇందుకు ఇతర భాషా నటీనటులు ఘాటుగా స్పందించారు. అది మెగా ఫ్యామిలీకి చుట్టుకుంది. దాంతో అల్లు అరవింద్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సురేష్ కొండేటి మా కుటుంబానికి పి.ఆర్.ఓ. కాదు. గోవా అవార్డులు ఫెయిల్ అయింది. ఇతర భాష నటీనటులు, సాంకేతిక సిబ్బంది మన తెలుగు సినిమా రంగాన్ని తిట్టుకుంటున్నారు. అందుకే ఆయనకు మాకు సంబంధం లేదని చెప్పారు.
 
దీనిపై సురేష్ కొండేటి వివరణ ఇలా వుంది..
గత 21 సంవత్సరాలుగా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి సంవత్సరం చాలా  కష్టపడి, గ్రాండ్‌గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా  అవార్డ్స్ ఇస్తున్నాను. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్, అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు.  ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరుపేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంతమంది బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments