Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఖరి షెడ్యూల్‌లో గోపీచంద్-సంపత్ నందిల చిత్రం

గోపీచంద్, సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మంగళవారం నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభమైంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాక

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (13:41 IST)
గోపీచంద్, సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మంగళవారం నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభమైంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాలుగో షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. "థాయ్‌ల్యాండ్, హైదరాబాద్‌లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక మంగళవారం నుంచి మొదలై ఫిబ్రవరి 20 వరకూ జరగనున్న నాలుగో షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లు గోపీచంద్-రాశీఖన్నా-కేతరీన్‌లపై కాంబినేషన్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసేందుకు దర్శకుడు సంపత్ నంది సన్నాహాలు చేసుకొంటున్నారు. 
 
రామ్-లక్ష్మణ్‌ల నిర్వహణలో చిత్రీకరించబడనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ఇక సంపత్ నంది యాక్షన్ సీన్స్ తోపాటు ఎమోషనల్ సీన్స్‌ను హ్యాండిల్ చేసిన విధానం, ఆ సన్నివేశాల్ని మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తన కెమెరాలో బంధించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. గోపీచంద్ ఈ సినిమాలో సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నారు. 
 
సంపత్ నంది మార్క్ పవర్‌ఫుల్ టైటిల్ తోపాటు గోపీచంద్ స్టైలిష్ లుక్‌ను కూడా త్వరలో విడుదల చేస్తాం. అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మా బ్యానర్ విలువను పెంచే విధంగా ఉంటుంది. ఇకపోతే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments