Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలకు కష్టంగా ఉందని బరువు తగ్గాను.. 6 నెలల్లో 13 కేజీలు... హాన్సిక

హీరో అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ హాన్సిక. ఆ తర్వాత అనేక భాషల్లో నటిస్తూనే.. తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా కనిపిస్తోంది. తాజాగా మంచు విష్ణుతో కలిసి 'లక్క

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (09:31 IST)
హీరో అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ హాన్సిక. ఆ తర్వాత అనేక భాషల్లో నటిస్తూనే.. తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా కనిపిస్తోంది. తాజాగా మంచు విష్ణుతో కలిసి 'లక్కున్నోడు' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో పాల్గొన్న హాన్సిక మాట్లాడుతూ "దక్షిణాదిన నేను చేసిన తొలి చిత్రం ‘దేశముదురు’. అందుకే నాకు తెలుగు నేల పుట్టిల్లులాంటిది. మిగిలిన ఎన్ని భాషల్లో నటించినా తెలుగు రాష్ట్రా‌ల్లో అడుగుపెట్టిన ప్రతిసారీ నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది" అని చెప్పుకొచ్చింది. 
 
పైగా, "తమిళంలో చేతినిండా సినిమాలు ఉండటంతో తెలుగులో కాస్త గ్యాప్‌ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ‘లక్కున్నోడు’ విడుదలైంది. జయం రవితో నటించిన తమిళ చిత్రం ‘భోగన్’ కూడా తెలుగులోకి అనువాదం కానుంది. సంపత్ నంది దర్శకత్వంలో మంచి పాత్ర చేస్తున్నాను. ఇప్పటివరకు నేను అలాంటి పాత్రలో నన్ను నేను చూసుకోలేదు. బస్తీ అమ్మాయిగా నటిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. 
 
బరువు తగ్గిన అంశాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఆరు నెలల్లో 13 కిలోలు బరువు తగ్గాను. ఎలాంటి డైటింగ్‌ చేయలేదు. మా అమ్మ చెప్పిన మెనూని పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యాను’’ అంతే... సులభంగా బరువు తగ్గిపోయినట్టు చెప్పారు. పెళ్లి గురించి ఇంకా ఆలోచన చేయలేదనీ, ప్రేమ వివాహమంటూ ఉండదని స్పష్టం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments