Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్ పుట్టిన రోజు.. తిరుపతిలో పెళ్లి.. నా భర్త లుంగీలో.. అరిటాకులో భోజ‌నం..?!

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (13:06 IST)
Janhvi Kapoor
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు నేడు పుట్టిన రోజు. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో అప్పుడప్పుడు యువతను ఇట్టే కట్టిపడేసే జాన్వీ, ధడక్ చిత్రంతో టాప్ హీరోయిన్ ముద్ర వేసుకుంది. ఈరోజు జాన్వీ తన 24వ పుట్టినరోజును జరుపుకుంటోంది
 
దఢక్ త‌ర్వాత కార్గిల్ గ‌ర్ల్ గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్‌లో న‌టించి అంద‌రి చేత ప్ర‌శంసలు కురిపించుకుంది. తల్లికి ద‌గ్గ త‌న‌య అంటూ ఇప్ప‌టికే జాన్వీపై అభిప్రాయాలు వినిపిస్తుండ‌గా.. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ప‌లు సినిమాలు ఉన్నాయి.
 
ఇటీవ‌ల‌ రాజ్ కుమార్ రావు, వ‌రుణ్ శ‌ర్మ, జాన్వీ క‌పూర్‌లు రూహీ అనే చిత్రంలో న‌టించారు. ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ల‌లోనూ వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇప్ప‌టికే ఈ మూవీ ట్రైల‌ర్‌తో పాటు పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా బ్రైడ్స్ ఇండియా మ్యాగ‌జైన్‌తో ముచ్చ‌టించిన జాన్వీ.. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.
 
ఈ క్ర‌మంలో త‌న పెళ్లి గురించి కూడా జాన్వీ మాట్లాడారు. ''నా పెళ్లికి సంబంధించి నాకు ఒక క్లియ‌ర్ పిక్చ‌ర్ ఉంది. నాకు తిరుప‌తిలో పెళ్లి చేసుకోవాల‌ని ఉంది. అందులో స‌న్నిహితులు మాత్ర‌మే ఉండాలి. నేను కాంచీవ‌రం చీర‌ను ధ‌రించి, బంగారం పెట్టుకొని, నా త‌ల‌లో పూల‌ను పెట్టుకోవాలి. నా భ‌ర్త లుంగీలో ఉండాలి. ఆ త‌రువాత మేమిద్ద‌రం అరిటాకులో భోజ‌నం చేయాలి. నాకు ఇష్టమైన వాడితో తిరుమల వెంకన్న ఆలయంలో నా పెళ్లి జరగాలి" అని అన్నారు. 
Janhvi Kapoor
 
"గ‌తంలో నేను అక్క‌డ జ‌రిగిన మా బంధువుల పెళ్లికి వెళ్లా. చాలా ఎంజాయ్ చేశా. ఆడంబ‌రంగా జ‌రిగే పెళ్లిళ్లంటే నాకు ఇష్టం ఉండ‌దు. అలాంటి పెళ్లిళ్ల‌కు వెళ్ల‌డం ఫ‌న్ అనిపించినా.. అలాంటి పెద్ద శుభ‌కార్యంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా ఉండ‌టం నాకు ఇష్టం" అని జాన్వీ చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments