Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyBirthdayNBK : 107వ సినిమాపై అధికారిక ప్రకటన

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (09:45 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తన పుట్టనరోజు వేడుకలను గురువారం (జూన్ 10వ తేదీ) జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన తన 107వ చిత్రంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. 
 
గోపీచంద్ మలిలేని దర్శకత్వంలో బాలయ్య ప్రధాన పాత్రలో 107వ సినిమాకు తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజా లుక్‌‌ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. 
 
ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘హంట్ స్టార్ట్స్ సూన్’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో దూసుకుపోతోంది.
 
ప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనేష్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా ప్రాజెక్టు ప్రారంభంకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments