Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో "వకీల్ సాబ్" సందడే సందడి..

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (18:32 IST)
తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ జాతర మొదలైంది. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ సందడే సందడిగా మారిపోయింది. 
 
కాగా, పవన్ కళ్యాణ్ మూడేళ్ళ విరామం తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా పవన్ చేసిన 'వకీల్ సాబ్' శుక్రవారం రిలీజ్ కాగానే అభిమానులు థియేటర్లను కమ్ముకున్నారు. 'వకీల్ సాబ్' తిష్ట వేసిన ప్రతి థియేటర్ ముందు జాతర జరిపారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ పవన్ అభిమానులు దాహం తీర్చుకున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన టాలీవుడ్ దర్శకులు కొందరు తమదైన శైలిలో స్పందించారు. దర్శకుడు అనీల్ రావిపూడి ... 'వకీల్ సాబ్' జడ్జిమెంట్ .. పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ .. పవన్ కల్యాణ్ వన్‌మేన్ షో ఇది. వేణు శ్రీరామ్ రచన .. దర్శకత్వం సూపర్బ్. తమన్ సంగీతం .. బీజీయం చాలా బాగున్నాయి. ఇంతమంచి సినిమాను అందించిన 'దిల్'రాజుకు .. శిరిష్ కు బిగ్ కంగ్రాట్స్ " అంటూ ట్వీట్ చేశాడు. 
 
ఇక పవన్‌తో ఇంతకుముందు 'గబ్బర్ సింగ్' చేసిన హరీశ్ శంకర్ .. 'జాతర షురూ అయింది' అంటూ పవన్ అభిమానులను హుషారెత్తించాడు. ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు. అలాగే, అనేక సినీ సెలెబ్రిటీలు కూడా వకీల్ సాబ్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments