Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్ లాఠీ ఫస్ట్ లుక్ విడుదల

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (17:32 IST)
Lathi First Look
యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లాఠీ' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు.
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో టాప్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
 
ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్‌గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్‌లో విశాల్ కనిపించారు. శరీరమంతా గాయాలతో పాటు భవనం నుండి లేజర్ కిరణాలు విశాల్ పై పడటం కూడా ఈ యాక్షన్ పోస్టర్‌లో గమనించవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశాల్ పవర్ ఫుల్ గా కనిపించారు. యాక్షన్‌తో నిండిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలని పెంచింది.  
 
సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ తన 'లాఠీ' తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్‌ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్‌కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.
 
విశాల్ సరసన సునైనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహకుడిగా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments