Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ప్లజంట్ పోస్టర్ తో హాయ్ నాన్న టీమ్ శుభాకాంక్షలు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (13:09 IST)
Nani, Mrinal Thakur
నేచురల్ స్టార్ నాని, నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. ఈ చిత్రం గ్లింప్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చివర్లో మృణాల్ ఠాకూర్ నానిని 'హాయ్ నాన్నా' అని పిలవడం క్యురియాసిటీని పెంచింది. గ్లింప్స్ సీక్వెన్స్ చూడడానికి అందంగా ఉండటంతో పాటు సినిమాలో వారి రిలేషన్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది.
 
ఈ రోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్  సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మృణాల్ కర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించింది మోడిష్ లుక్‌ లో ఆకట్టుకున్నారు మృణాల్.
 
వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
 
ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ కి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.  
 
'హాయ్ నాన్న' ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments