Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న కాంతార

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2022 (11:12 IST)
కన్నడ చిత్రం కాంతార ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో, ఆత్మలను సంతృప్తి పరిచేలా సాగే 'భూత కోల' అనే ప్రాచీన నృత్యాన్ని కూడా చూపించారు. ఇందులో నర్తించేవారిని దైవ నర్తకులు అంటారు. 
 
కాంతార చిత్రం చివర్లో రిషబ్ శెట్టి దైవ నర్తకుడిగా విశ్వరూపం ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా సెన్సేషనల్ కలెక్షన్స్‌తో దుమ్ములేపుతూ దూసుకుపోతున్న కన్నడ డబ్ మూవీ కాంతార తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంటూ దుమ్ములేపుతుంది. 
 
ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పుడు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో కూడా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్స్ పరంగా పరుగులు పెడుతోంది.
 
ఈ చిత్రం ఐదవ రోజు మరోసారి వర్కింగ్ డేలో ఉన్నప్పటికీ నైట్ షోలకు ఎక్స్ లెంట్ ట్రెండ్‌ని చూపించింది. మొత్తం మీద 4వ రోజు 1.45 కోట్ల షేర్‌ని అందుకుంటే 5వ రోజు కేవలం 9 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా ఏకంగా 1.36 కోట్ల రేంజ్‌లో షేర్‌ని సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments