Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి''ని చూసి పడిపోయానంతే.. కైరా అద్వానీ

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (15:02 IST)
''భరత్ అనే నేను'' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటిస్తోంది. తెలుగులో కైరాకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది. మరో పంజాబీ సినిమాలో కైరా నటిస్తోంది. 
 
ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన కైరా ప్రస్తుతం అర్జున్ రెడ్డి అదేనండి విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసి.. ట్రెండింగ్‌లో నిలిచింది. మొన్నటికి మొన్న అతిలోక శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసి.. ట్రెండింగ్‌లో అగ్రస్థానం కొట్టేసింది. తాజాగా కైరా కూడా అదే పనిచేసింది. 
 
అసలు విషయం ఏమిటంటే.. కైరా అద్వానీ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. 
 
అయితే కైరా తెలుగు సినిమా అర్జున్ రెడ్డిని చూసిందట. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ నటనను చూసి ఫిదా అయ్యానని.. అంతేకాకుండా ఆ సినిమాను చూశాక విజయ్ దేవరకొండకు అభిమానిగా మారిపోయానని చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments