Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమడిగినా తెలియదంటున్నాడు.. మెగా కాంపౌండ్‌లో మరీ ఇంత అమాయకుడా!

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (10:22 IST)
ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్, అలీ నడుమ జరిగిన వివాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. రాజకీయ కారణాల వలన వీరి మధ్య రగిలిన చిచ్చు స్నేహితుల మధ్య దూరాన్ని పెంచింది. 'అలీని ఎంతగానో నమ్మాను, సాయం చేశాను, కానీ నాకు నమ్మక ద్రోహం చేశాడు' అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించగా... అలీ కూడా ఏమాత్రం తగ్గకుండా 'మీరు మీ అన్నయ్య చిరంజీవి సాయంతో పైకొచ్చారు... నేను ఎవరి సాయం లేకుండా స్వంతంగా కష్టపడి ఇంత స్థాయికి చేరుకున్నాను, అలాంటిది మీరెప్పుడు నాకు సాయం చేశారు?' అంటూ ఎదురు ప్రశ్నించారు.
 
తన ఇటీవలి చిత్రం ‘చిత్రలహరి' సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధులు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ను పవన్ కళ్యాణ్- అలీ వివాదం గురించి ప్రశ్నించగా ‘నాకు అసలు గొడవ జరిగినట్లే తెలియదు, నేను ఆ సమయంలో ఇక్కడ లేను. ఏంటో తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు' అంటూ సమాధానం ఇచ్చారు. ఇక మీ పెదమామయ్య నాగబాబు యూట్యూబ్‌లో ‘నా ఛానల్ నా ఇష్టం' ఛానెల్‌లో చేసిన వీడియోలు చూశారా? అని ప్రశ్నించగా... ‘లేదండీ, అలాంటి ఛానెల్ ఉందనే విషయం కూడా నాకు ఇప్పటిదాకా తెలియదు' అంటూ ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టాడట.
 
ఇక మీ సినిమా ‘ఇంటిలిజెంట్' టీజర్‌ను బాలకృష్ణ లాంచ్ చేశారు. మీ మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. మరి ఇటీవల నాగబాబు బాలకృష్ణను కమెంట్ చేసారు కదా? అనే ప్రశ్నకు ‘హా..చూశాను బట్, ఎందుకో, ఏమో తెలియకుండా మద్దతు తెలపడం, ఖండించడం లాంటివి చేయలేను' అంటూ దాటవేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిలో పాక్ సైనికుడు... తేల్చిన నిఘా వర్గాలు

కాశ్మీర్‌లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఈ రోజు అర్థరాత్రి లోపు పాక్ పౌరులు దేశం విడిచి పోవాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలు!!

Chicken: చికెన్‌ను కట్ చేయమన్న టీచర్.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments