Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (13:24 IST)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం "పెద్ది". ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లపై మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఆ చిత్రం బృందం మరో ఆసక్తికరమైన వార్తను వెల్లడించింది. 
 
ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ధర దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్‌ రూ.35 కోట్లకు దక్కించుకుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కాగా, రెహ్మాన్ - చరణ్ కాంబినేషన్‌లో ఇదే తొలి మూవీ కావడం గమనార్హం. 
 
ఇక చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీన మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. దీనికోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ చిత్రంలో చెర్రీ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments