Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కళ్లల్లో ఒకటి చిన్నదైపోయింది.. రోజూ అద్దంలో చూసుకుని ఏడుస్తున్నాను: వినోద్

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (19:28 IST)
జబర్దస్త్ నటుడు వినోద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుడే అయినా మహిళా పాత్రల్లో వినోద్ మెప్పిస్తాడు. కానీ కాచిగూడలోని కుత్బిగూడాలో ఇంటి ఓనర్, కొందరు దుండగులు కలిసి చేసిన దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డారు.


తలపై, ముఖంపై బలమైన గాయాలు కావడంతో స్నేహితులు అతడిని హాస్పిటల్‌కి తరలించారు. కొద్దిరోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వినోద్ ప్రస్తుతం కోలుకొని తనపై జరిగిన దాడి గురించి వెల్లడించాడు.
 
దాడి జరిగిన తరువాత తనకు ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదని చెబుతూ వినోద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను లేడీ గెటప్పులో రాణించడానికి కళ్లే ప్రధాన కారణమని చెప్పాడు.

ఆ కళ్లలో ఒకటి చిన్నగా అయిపోవడం అదేవిధంగా సరిగ్గా కనిపించకపోవడంతో తనకు భయమేస్తుందని తెలిపాడు. తన కన్ను చిన్నగా అయిన కారణంగా లేడీ గెటప్ సూట్ అవ్వదని అందరూ భావిస్తున్నారని తెలిపాడు. 
 
ఇక అవకాశాలు రావేమోనని టెన్షన్ పడుతున్నారు. ఆ కన్నును రోజూ అద్దంలో చూసుకొని ఏడుస్తున్నానని భావోద్వేగానికి లోనైయ్యాడు. తను ఉంటోన్న ఇల్లు కొందామని ఓనర్‌కి పది లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెబితే అతడు మోసం చేయడమే కాకుండా తన మనుషులతో కొట్టించాడని వినోద్ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments