Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పటికైనా బాలయ్య ఛాన్సిచ్చేనా?

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ బయోపిక్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు, సినీ హీరో బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:32 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ బయోపిక్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు, సినీ హీరో బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వివిధ రకాల పాత్రలకు అనేక మంది ప్రముఖ సెలెబ్రిటీలను ఎంపిక చేశారు.. చేస్తున్నారు కూడా. మరోవైపు, ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
 
నిజానికి గత కొంతకాలంగా బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న ప్రచారం బాగా ఉంది. ఆ వార్తలు నిజమేనేమో అన్నట్లుగా చాలాకాలంగా వీరిద్దరు కలిసిందే లేదు. దాంతో నందమూరి అభిమానులు ఈ బాబాయి - అబ్బాయిలు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో నందమూరి ఫ్యామిలీలో ఓ విషాదకర సంఘటన జరిగింది. టాలీవుడ్ హీరోలు తారక్, కళ్యాణ్ రామ్‌ల తండ్రి బాలకృష్ణ అన్నయ్య అయిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో నందమూరి ఫ్యామిలీతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కూడా ఒక్కటయ్యారు. 
 
హరికృష్ణ మరణంతో షాక్‌లో ఉన్న నందమూరి అభిమానులకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనే నందమూరి ఫ్యాన్స్‌లో కొత్త కోరికలు కలుగుతున్నాయి. మొన్నటివరకు బాబాయి - అబ్బాయి కలవాలని కోరుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు అది నెరవేరడంతో మరో కోరిక కోరుకుంటున్నారు. 
 
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య నటిస్తుండగా హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ఇదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 
 
ఎలాగూ నందమూరి హీరోలు కలిసి పోయారు కనుక 'ఎన్టీఆర్' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 'ఎన్టీఆర్' సినిమా స్థాయిని పెంచేందుకు బాలయ్య బాబు కాస్త మంచి మనసు చేసుకుని జూనియర్‌కు ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు వేడుకుంటున్నారు. మరి అభిమానుల వేడుకోలును బాలయ్య బాబు వింటాడో లేదో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments