Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీఐపీ రీమేక్ ఆర్టిస్ట్ పద్మావతి సెట్లోనే మృతి.. భవనం వద్ద దొరికిన మృతదేహం.. ఏమైంది?

ధనుష్‌ తమిళ చిత్రం 'వీఐపీ'కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న కన్నడ జూనియర్ ఆర్టిస్ట్ పద్మావతి (44) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈమె అనుమానాస్పదస్థితిలో సెట్స్‌లోనే ప్రాణాలు కోల్పోవడ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (17:28 IST)
ధనుష్‌ తమిళ చిత్రం 'వీఐపీ'కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న కన్నడ జూనియర్ ఆర్టిస్ట్ పద్మావతి (44) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈమె అనుమానాస్పదస్థితిలో సెట్స్‌లోనే ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. యలహంక సమీపంలోని ఓ భవనంలో సోమవారం సాయంత్రం షూటింగ్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
దాదాపు 120 మంది బృందంతో వీఐపీ సినిమాను కన్నడ రీమేక్ షూటింగ్‌ యలహంకలో జరుగుతుండగా... సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్యాకప్ సమయంలో పద్మావతి సెట్లో లేదని యూనిట్ గుర్తించింది. వెంటనే ఆమెకోసం వెతకడంతో నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద ఆమె మృతదేహం దొరికింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
పద్మావతి కనిపించలేదని రాత్రి 9 గంటలకు తమకు సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దర్శకుడిని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఇంకా పద్మావతి మృతి పట్ల అనుమానాలున్నాయని స్నేహితులు అంటున్నారు. అయితే నిర్మితమవుతున్న భవనం ఎనిమిదో అంతస్తు నుంచి ఆమె కిందపడిపోయి మరణించినట్లు యూనిట్ చర్చించుకుంటోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments