Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ ''కథానాయకుడు''కి యంగ్ టైగర్ వాయిస్ ఓవర్

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (12:03 IST)
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో తొలి భాగమైన కథానాయకుడుకి సంబంధించిన సన్నివేశాలు, పాటలను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ భాగానికి సంబంధించిన చిత్రీకరణ చాలావరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషించనున్నట్టు తెలుస్తోంది. కానీ తొలిభాగం చిత్రీకరణ దాదాపు పూర్తయిన తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించట్లేదని కూడా టాక్ వస్తోంది. 
 
ఈ సినిమా ఆరంభంలో ఎన్టీరామారావు గురించిన వాయిస్ ఓవర్ ఉంటుందట. ఆ వాయిస్ ఓవర్‌ను యంగ్ ఎన్టీఆర్‌తో చెప్పించాలనే ఆలోచనలో టీమ్ ఉందని టాక్. అదే జరిగితే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవరే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా వుంటుందని సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్, జయప్రదగా తమన్నా కనిపిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. దివంగత నేత ఎన్టీఆర్ జీవిత కథతో, బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న రెండు భాగాల చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నాడు.


ఈ చిత్రంలో భరత్ రెడ్డి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ వెనక నిలబడి ఉన్న దగ్గుబాటిగా భరత్ రెడ్డి అలరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, దగ్గుబాటి మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

శ్రీ లైరాయిదేవి ఆలయ జాతరలో తొక్కిసలాట : ఏడుగురి దుర్మరణం

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments