Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాతపస్విని మెప్పించిన 'సర్వం తాళమయం'

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:34 IST)
శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి కిరణం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్, రాజీవ్ మీనన్ ఇటీవల రూపొందించిన చిత్రం ‘సర్వం తాళ మయం’పై  ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను చూసిన ఆయన ‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూసాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీసారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కి నా ఆశీర్వాదాలు’ అని అభినందిస్తూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
 
ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులలో ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ మొదలైనవారు రాజీవ్ మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 8న తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ విడుదలవుతోంది. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

Monsoon: జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

అటు నుంచి బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి బాంబు వెళ్లాలి : సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments