నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సిక్స్ ప్యాక్‌లో డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ నటిస్తున్న కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... ''జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదో డిఫరెంట్ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్ సినిమా ఇది'' అన్నారు.