Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ హాట్ బ్యూటీ రాగిణి ద్వివేది అరెస్టు... ఎందుకంటే...

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (12:13 IST)
సినీ ఇండస్ట్రీలోకి డ్రగ్ మాఫియా వచ్చి చేరిపోయింది. ఫలింతగా అనేక మంది సెలెబ్రిటీలకు మాదకద్రవ్య వ్యాపారులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో సినీ సెలెబ్రిటీలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా కన్నడ హాట్ బ్యూటీ రాగిణి ద్వివేదిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్యాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల వాడకంపై ఇప్పటికే సినీ నిర్మాత, జర్నలిస్టు ఇంద్రజిత్ లంకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద జరిపిన విచాణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైగా, డ్రగ్స్ వ్యాపారులతో రాగిణికి సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం శాండిల్‌వుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. 
 
నిజానికి ఈ డ్రగ్స్ వ్యవహారంలో రాగిణికి సీసీబీ పోలీసులు సమన్లు జారీచేసి, గురువారం రాత్రిలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. కానీ, ఆమె వెళ్లలేదు. దీంతో శుక్రవారం ఉదయం ఆరు గంట‌ల‌కే రాగిణి నివాసానికి చేరుకున్న సీసీబీ.. బెంగ‌ళూరులోని రాగిణి ద్వివేది నివాసంలో శోధ‌న‌లు నిర్వ‌హించారు. 
 
కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందిన పోలీసులు న‌టి ఇంటిని క్షుణ్ణంగా త‌నిఖీ చేసారు. అక్క‌డ కొంత స‌మాచారాన్ని సేక‌రించారు. ఆ తర్వాత ఆమెను కూడా అదులోకి తీసుకున్నారు. కాగా, రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేసిన సంగ‌తి తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments