Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ కన్నడ గాయకుడు శివమొగ సుబ్బన్న మృతి

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (14:05 IST)
Shivamogga Subbanna
ప్రముఖ కన్నడ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ సుబ్బన్న (83) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బన్న గురువారం రాత్రి బెంగళూరులోని జయదేవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
 
సుబ్బన్న మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సుబన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయన అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.
 
సుబ్బన్న అసలు పేరు జి.సుబ్రమణ్యం. 1938లో శివమొగ్గ జిల్లాలోని నగర్‌ గ్రామంలో జన్మించారు.' కాడు కుదురె' చిత్రంలోనే 'కాడు కుదురె ఒడి బండిట్టా' అనే పాటకు 1979లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా రజత కమలం అవార్డును సుబ్బన్న అందుకున్నారు. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న ప్రత్యేక గుర్తింపు పొందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments