Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెరపైకి కరణ్ పేరు... సంబంధం లేదంటూ స్టేట్మెంట్

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:22 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఇపుడు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయనకు ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులకు సంబంధం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
నిజానికి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత కరణ్ జోహార్‌పై అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. బాలీవుడ్‌లో బంధుప్రీతిని, స్టార్ వారసత్వాన్ని కరణ్ ప్రోత్సహిస్తూ బయటి వాళ్లను తొక్కేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కరణ్‌పై సగటు అభిమాని కూడా దుమ్మెత్తి పోశాడు. 
 
ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో కరణ్ జోహార్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ సరఫరాదారులుగా ఎన్‌సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రా.. కరణ్‌కు అత్యంత సన్నిహితులని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
ఈ వార్తలపై కరణ్ జోహార్ స్పందించారు. ఆ ఇద్దరితో తనకెలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశాడు. 'ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలో అనుభవ్ చోప్రా ఉద్యోగి కాదు. 2011-12 మధ్య కాలంలో కేవలం 2 నెలలు మాత్రమే మా సంస్థలో పనిచేశాడు. ఇక, క్షితిజ్ ప్రసాద్ మా సంస్థలో ఓ ప్రాజెక్టు కోసం గతేడాది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యాడు. 
 
అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అంతకుమించి ఆ ఇద్దరు వ్యక్తులతో, వాళ్ల వ్యక్తిగత జీవితాలతో నాకు, ధర్మ ప్రొడక్షన్స్‌కు ఎలాంటి సంబంధమూ లేద'ని కరణ్ పేర్కొన్నాడు. అలాగే తను ఎప్పుడూ మాదకద్రవ్యాలు తీసుకోలేదని, డ్రగ్ డీలర్స్ ఎవరితోనూ సంప్రదింపలు జరపలేదని స్పష్టం చేశాడు. 
 
అలాగే, తన ఇంట్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ఇంట్లో జరిగిన పార్టీలో కూడా ఎలాంటి మాదకద్రవ్యాలను వాడలేదని విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments