Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ బయోపిక్: జగన్ సతీమణి భారతి పాత్రలో కీర్తి సురేష్?

టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతుంది. ఇందులో టాప్ హీరోయిన్ నయనతార వైఎస్సార్ సతీమణిగా, కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (11:02 IST)
టాలీవుడ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతుంది. ఇందులో టాప్ హీరోయిన్ నయనతార వైఎస్సార్ సతీమణిగా, కేరళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ బయోపిక్‌‌లో జగన్ భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.

ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య చేయనున్నట్లు సమాచారం. 
 
ఇక జగన్ భార్య భారతి పాత్రలో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని.. విజయ్ చిల్లా.. దేవిరెడ్డి శశి ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఇకపోతే.. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ పాదయాత్ర నుంచి.. సీఎం పదవి చేపట్టేవరకు ఈ కథ కొనసాగుతుందని సినీ జనం అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments