Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ షో స్టార్ట్.... 'ఖైదీ నెంబర్‌ 150' ప్రత్యేక ప్రదర్శన ప్రారంభం.. టాకేంటి?

తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ షో స్టార్ట్ అయింది. ఆయన నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్ర ప్రత్యేక ప్రదర్శన బుధవారం వేకువజామునుంచి ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. హైదరాబాద్‌లోని ఐమ

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (05:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ షో స్టార్ట్ అయింది. ఆయన నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్ర ప్రత్యేక ప్రదర్శన బుధవారం వేకువజామునుంచి ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన ఆరంభమైంది. 
 
వెండితెరపై తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. తన ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' పలుచోట్ల ప్రత్యేక ప్రదర్శన అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, పాలకొల్లు పట్టణాలతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శన ప్రారంభం కావడంతో ఆయా థియేటర్ల వద్ద చిరంజీవి అభిమానుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. 
 
బాణాసంచా కాలుస్తూ, భారీ కటౌట్లు కడుతూ కేరింతలు కొడుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నందున ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఏలూరులో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన తిలకించేందుకు స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి హాజరయ్యారు. అయితే, ఈ చిత్రం టాక్ తెలియాలంటే మరో మూడు గంటలు వేచి ఉండాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments