Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగం చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ ఇకలేరు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (08:46 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు కేవీ ఆనంద్ ఇకలేరు. ఈయన జీవా హీరోగా వచ్చిన రంగం చిత్రానికి దర్శకత్వం వహించి, తన సత్తాచాడు. ఈ క్రమంలో ఆయన గురువారం గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. 
 
చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ‌లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. క‌ల్కి, ఇండియా టుడే దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ను క‌లిసి ఆయ‌న సినిమాటోగ్ర‌ఫీలో శిష్యుడిగా మారారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ వ‌హించిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది. 
 
ఆ తర్వాత తమిళంలో 'కణా కండేన్' చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం తర్వాత సూర్యతో అయాన్ (తెలుగులో వీడొక్కడే) చిత్రానికి దర్శకత్వం వహించి, దర్శకుడుగా అవతారమెత్తారు. ఆపై జీవా హీరోగా కో (తెలుగులో రంగం)తో ఆయనసత్తా ప్రేక్షకులకు తెలిసింది.
 
తర్వాత మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్), ఆనేగన్ (తెలుగులో అనేకుడు, కాప్పాన్ (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మరణం కోలీవుడ్ కు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments