Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌లకు సమాన క్రెడిట్ ఇవ్వరా..? మహేష్ బాబు హీరోయిన్ ప్రశ్న

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:01 IST)
మహేష్ బాబు సరసన "నేనొక్కడినే" సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతి సనన్ బాలీవుడ్‌‌లో తాజాగా కార్తిక్‌ ఆర్యన్ హీరోగా కలిసి ‘లుకా చుప్పి’ సినిమా విజయం సాధించింది. సహజీవనం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విజయం క్రెడిట్ పూర్తిగా హీరో కార్తిక్‌కి మాత్రమే దక్కుతోందని అసంతృప్తి వ్యక్తం చేసారు కృతి.
 
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ప్రస్తుత కాలంలో హీరోయిన్లకు కూడా గుర్తింపు వస్తోంది. అలాంటప్పుడు ‘లుకా చుప్పి’ కేవలం కార్తిక్‌ వల్లే హిట్ అయిందని చెప్పడం సరి కాదు. ఒకవేళ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకుండా, మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంటే ఫరవాలేదు, గానీ సినిమా మొత్తం హీరోహీరోయిన్లు సమానంగా నడిపించినప్పుడు క్రెడిట్ కూడా ఇద్దరికీ సమానంగా దక్కాలి. 
 
రెమ్యునరేషన్ విషయానికొస్తే.. నాకు డబ్బు ముఖ్యమే, కానీ సినిమా ఒప్పుకోవాలంటే అదే ప్రధానం కాదు. గతంలో హీరో కంటే హీరోయిన్లకే ఎక్కువ పారితోషికాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి’ అంటూ గుర్తు చేశారు కృతి సనన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments