Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ్ కృష్ణ సమర్పణలో లంబసింగి చిత్రం

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (12:07 IST)
Lamba singi
`బంగార్రాజు` ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత జీకే మోహన్ ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. సరికొత్త కంటెంట్ చిత్రాలని రూపొందించే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న కాన్సెప్ట్ ఫిల్మ్  తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌ను ప్రకటించింది. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి కథానాయికగా కనిపించనుంది.
 
ప్రతిభ గల కొత్త నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంతో భరత్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి లంబసింగి అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక.    
 
ఆర్ఆర్ దృవన్  సంగీతం అదించిన ఈ చిత్రం నుండి మొదటి పాట ''నచ్చేసిందే నచ్చేసిందే''ని ఏప్రిల్ 16న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ రోజు పాటకు సంబధించిన  ప్రోమోను విడుదల చేశారు. మెస్మరైజ్ చేస్తున్న ఈ  రొమాంటిక్ మెలోడీని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. ఈ ప్రోమో పూర్తి పాట కోసం ఎదురుచూసేలా ఆసక్తిని పెంచింది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
 
కె బుజ్జి సినిమాటోగ్రాఫర్ గా, కె విజయ్ వర్ధన్ ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
 
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
 
తారాగణం: భరత్, దివి
సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: జికె మోహన్
సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల
బ్యానర్: కాన్సెప్ట్ ఫిల్మ్స్
డివోపీ : కె బుజ్జి
సంగీతం: ఆర్ఆర్ దృవన్
ఎడిటర్: కె విజయ్ వర్ధన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments