Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలెక్కనున్న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి : 9న నిశ్చితార్థం?

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (12:45 IST)
మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లీ పీటలెక్కనున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్.. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోనున్నారనీ, వీరిద్దరికీ ఈ నెల 9వ తేదీన నిశ్చితార్థం జరుగనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. 
 
అయితే, పెళ్లి ఎపుడనేది ఇంకా తెలియలేదు. తాము మంచి స్నేహితులమని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. జూన్ ఒకటో తేదీన వీరిద్దరూ హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరి నిశ్చితార్థంపై మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. 
 
కాగా, తాను రోమ్‌లో ఉన్నట్టు వరుణ్ తేజ్ ఇటీవల ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేసిన విషయం తెల్సిందే. అలాగే, లావణ్య కూడా తాను టూర్‌లో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో వీరిద్దరూ కలిసే ప్రయాణం చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేయసాగారు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించగా, గత 2017 నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments